బాపట్ల: యద్దనపూడి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ వార్షిక తనిఖీ

55చూసినవారు
బాపట్ల: యద్దనపూడి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ వార్షిక తనిఖీ
బాపట్ల డిఎస్పి జి రామాంజనేయులు బుధవారం యద్దనపూడి పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ముందుగా ఆయన ఎస్ఐ రత్నకుమారి, సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి క్రైమ్ రికార్డులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి నేర నిరోధక చర్యలపైన, నేరాల దర్యాప్తు మీద పలు సూచనలు చేశారు. సదా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్