ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ఏపీ భవన్ లో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ సహచర ఎంపీలు కలిశారు. ఏపీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు, పలు అంశాలపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విషయాల పై చర్చించి తగు సూచనలు, సలహాలు చంద్రబాబు ఇచ్చారని బాపట్ల ఎంపీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.