బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో సత్తా చాటారు. 40 ప్లస్ విభాగంలో షాట్ పుట్ లో స్వర్ణ, జావలిన్ త్రోలో రజత పతకాలు సాధించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నాగరాజును దుశ్శాలువతో ఘనంగా సన్మానించి అభినందించారు.