బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా గంట అంజిబాబుని నియమిస్తూ ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైన గంట అంజి బాబును పార్టీ గుర్తించి పదవికి ఎంపిక చేసినట్లు బాపట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా తెలిపింది.