బాపట్ల మండల పరిధిలోని వెదుళ్ళపల్లి గ్రామం బదిరుల పాఠశాల వెనుక బుధవారం తెల్లవారుజామున భారీగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిబంధనలను ఉపక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గత నెల రోజుల క్రితం అధికారులు నామమాత్రంగా దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. మరల యధేచ్చగా అక్రమ ఇసుక రవాణా జరగటం గమనార్హం.