బాపట్ల: 11ఏళ్ల బాలికపై అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

78చూసినవారు
బాపట్ల పట్టణం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బడుగు నాగేశ్వరరావు సోమవారం 11 ఏళ్ల బాలికపై అనుచితంగా ప్రవర్తించడంతో అతన్ని అరెస్టు చేసినట్లు బాపట్ల డిఎస్పి రామాంజనేయులు తెలిపారు. సంఘటన జరిగిన నేపథ్యంలో సంబంధిత అధికారులను విచారించి మీడియాలో ప్రచురించాలి తప్ప, అసత్య ప్రచారాలు చేయరాదని ఖండించారు. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా మాధ్యమాలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్