బాపట్ల మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ మరియు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగాల చంద్రశేఖర్ సోమవారం ఆయనను కలిసి పరామర్శించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.