బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా బాపట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ వెంకటమురళిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. జర్నలిస్టులందరికీ తప్పక న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ వెంకటమురళినీ జర్నలిస్టు సంఘ సభ్యులు సత్కరించారు.