అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే నవేగేశన నరేంద్ర వర్మ అన్నారు. సోమవారం పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామానికి చెందిన అర్హులకు ఆయన చెక్కులనుఅందించారు. అనారోగ్య బారిన పడినవారు సీఎం సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యమేసీఎం సహాయనిధి అని పేర్కొన్నారు.