దీపావళి బాణసంచా విక్రయించే దుకాణాలు, తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్లకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు పొందాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.