బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలంలో శనివారం సాయంత్రం వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ వేడిమి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి ఆకాశం కారు మబ్బులు కమ్మి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో ప్రజలు సేద తీరుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలిపారు.