ఐటి హబ్ ఏర్పాటు చేయాలి: ఎంపీ తెన్నేటి

75చూసినవారు
ఐటి హబ్ ఏర్పాటు చేయాలి: ఎంపీ తెన్నేటి
బాపట్ల జిల్లా పరిధిలో చీరాల ప్రాంతంలో ఐటి హబ్ ఏర్పాటు చేయాలని బాపట్ల పార్లమెంటు సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ బుధవారం ఐటీ మంత్రి నారా లోకేష్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సాధ్యమైనంత తొందరలో ఐటి హబ్ ఏర్పాటుకు సన్నహాలు చేయాలని వివరించారు. మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు బాపట్లలోని ఎంపీ కార్యాలయం తెలిపింది.

సంబంధిత పోస్ట్