కర్లపాలెం: పెద్దాపులుగువరపాలెంలో తాత్కాలిక వంతెన ఏర్పాటు

79చూసినవారు
కర్లపాలెం: పెద్దాపులుగువరపాలెంలో తాత్కాలిక వంతెన ఏర్పాటు
కర్లపాలెం మండలం పెద్దాపులుగువరపాలెం సమీపంలో ఉన్న సముద్ర తీరంలో చుట్టుపక్కల గ్రామాలు ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి సందర్భంగా స్నానాలు ఆచరిస్తారు. అయితే సముద్ర తీరానికి వెళ్లే దారి మధ్యలో పొన్నాల కాలువ పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడంతో గ్రామ పెద్దలు, యువకుల సహకారంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయడం జరిగిందని గురువారం గ్రామస్తులు తెలిపారు. వంతెనపై ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర మోటార్ వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్