బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామం కేర్ యోగ నాచరోపతి, మెడికల్ కాలేజ్ ఫౌండర్ రాధాకృష్ణ రాజు ఆధ్వర్యంలో శనివారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ బట్టిప్రోలు వరద బాధితులకు 25 టన్నుల నిత్యవసర సరుకుల పంపిణీ వాహనాన్ని ప్రారంభించారు. కేర్ యోగా ఫౌండేషన్ రాధాకృష్ణరాజు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో భాగంగా వరద బాధితులకు సహాయo అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాధాకృష్ణ రాజును అభినందించారు.