దీపావళి సందర్భంగా బాపట్ల పట్టణంలో లైసెన్సులు పొందిన వారు మాత్రమే అమ్మకాలు జరుపుకోవాలని పట్టణ సీఐ మహమ్మద్ జానీ పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. పట్టణ ప్రాంతంలో సూచించిన ప్రాంతంలో విక్రయాలు జరపాలని అమ్మకం దారులకు సూచించారు. దీపావళి పండుగ సంతోషంగా జరుపుకోవాలని చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన అమ్మకం దారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.