ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ప్రజలందరికి సీజనల్ వ్యాధులు కలరా, మలేరియా, డెంగ్యూ ఇతర ప్రాణాంతకర వ్యాధులపై అవగాహన కల్పించాలని మన్నవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మునిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన" ఆశాడే" కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ వేణు, ఆశా, ఏఎన్ఎం లు పాల్గొన్నారు.