బాపట్ల జిల్లా చందోలు గ్రామానికి చెందిన ఎండి రియాజ్ అహ్మద్ డా. ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ ప్రతిభ అవార్డుకు ఎంపికైనట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2000సం. లో ఇండియన్ బ్లూమ్స్ విద్యాసంస్థను స్థాపించి సాధారణ విద్యార్థులను అసాధారణ విద్యార్థులుగా తీర్చిదిద్ది ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు దక్షణాది ప్రైవేటు లెక్చరర్స్ టీచర్స్ సంస్థ ఈనెల 20న నాగార్జున యూనివర్సిటీలో అవార్డు ప్రధానం చేస్తారన్నారు.