వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల పట్టణంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుని అనుగ్రహంతో, ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు వరదల కారణంగా ఎదురైనా కష్టకాలాన్ని జయించి, సకల సౌభాగ్యాలతో, శాంతితో మళ్లీ వారి జీవితాలను గడపాలని ఆయన పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.