బాపట్ల పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుదే రాజారావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదురు ఆయన మీడియాతో మాట్లాడారు. బాపట్ల రైలు పేట, ఎమ్మార్ నగర్, ఉప్పరపాలెం, బేతనియా కాలనీ తదితర ఆరు వార్డులు కలిపి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. జనాభా పెరుగుదల, శాంతిభద్రతల దృష్ట్యా అవసరమన్నారు.