చిలకలూరిపేట పట్టణంలో ఈనెల 28న పాక్షికంగా మంచి నీరు సరఫరా చేస్తున్నట్లు గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు తెలిపారు. పట్టణంలో వాటర్ పంపింగ్ మెయిన్ పైప్ లైన్ మరమ్మతులు చేయాలన్నారు. ఈ సందర్భంగా రాగన్నపాలెం, పురుషోత్తపట్నం, మార్కండేయ నగర్, భావన రుషి నగర్ పరిసర ప్రాంతాలకు ఈనెల 28నమంచినీటిని పాక్షికంగా విడుదల చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని, సహకరించాలని కోరారు.