మకర సంక్రాంతి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల జీవితాల్లో ఆనందంతో పాటు ఆయురారోగ్యాలు నింపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కనుమ నాడు మన జీవితాల్లో భాగమైన పశుసంపదను పూజించి, మూగజీవాలపై మనకున్న ప్రేమాభిమానాలను చాటుకుందామన్నారు. ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.