చిలకలూరిపేట వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణి తనను అరెస్టు చేసిన విధానాన్ని వివరిస్తూ విడుదల చేసిన వీడియో మంగళవారం వైరల్ అయింది. పలువురు పోలీసులు మహిళనని చూడకుండా చేయి చేసుకున్నారని, ఈ విషయం జడ్జి దృష్టికి తీసుకెళ్లానని ఆమె తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేని తన భర్తను కూడా జైలుకి పంపారని వాపోయారు. ఇప్పటికి సుమారు 11 కేసులు పెట్టారని ఇంకెన్ని పెడతారో తెలియదని చెప్పారు.