ప్రజల సంతోషమే తన సంతోషంగా పనిచేసే సీఎం దొరకడం ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిపేట తన నివాసంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 21 మందికి రూ. 23.25 లక్షల విలువైన చెక్కులను అందించామన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.