మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మంగళవారం పల్నాడు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా కందుల శ్రీకాంత్ ను నియమించడం జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు అప్పజెప్పిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తిస్తుందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన మాజీ మంత్రి విడదల రజినికి రుణపడి ఉంటాను అని అన్నారు.