చిలకలూరిపేటలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆత్మహత్య చేసుకున్న కారుచోల వసంతరావు బంధువులు ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. వసంతరావుది ఆత్మహత్య కాదని, అతన్ని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతుడి బంధువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణ సీఐ రమేశ్ ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.