రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఆయన పార్థివ దేహానికి చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ ను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు.