చీరాల: వైన్ షాపులు,బార్లు సమయపాలన పాటించాలి:ఎక్సైజ్ సీఐ

58చూసినవారు
చీరాల: వైన్ షాపులు,బార్లు సమయపాలన పాటించాలి:ఎక్సైజ్ సీఐ
మద్యం దుకాణదారులు, బార్ షాప్ ల నిర్వాహకులు విధిగా సమయ పాలన పాటించాలని చీరాల ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు, మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే తెరిచి వుంచాలని చెప్పారు. సర్కిల్ పరిధిలో నూతనంగా షాపులు పొందిన 24 మద్యం దుకాణాదారులు ఈనెల 30 లోపుగా వారి దుకాణాలను ఖచ్చితమైన స్థానాలలో ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్