గుంటూరు తూర్పు డీఎస్పీగా అబ్దుల్ అజీజ్ బాధ్యతలు

70చూసినవారు
గుంటూరు తూర్పు డీఎస్పీగా అబ్దుల్ అజీజ్ బాధ్యతలు
గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా షేక్ అబ్దుల్ అజీజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా గుంతకల్ రైల్వే డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై గుంటూరుకు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్