గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతిపై కొత్తపేట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతని ఆచూకీ తెలిసినవారు కొత్తపేట పోలీసు స్టేషన్ ను సంప్రదించాలని పోలీసులు కోరారు.