తెనాలిలో బిల్డర్ విజయ కృష్ణ తమను బెదిరిస్తున్నాడని శ్రీనివాసులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. బిల్డర్ వద్ద 3 ఫ్లాట్లు రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసినట్టు చెబుతూ, రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాత స్లాబ్ వరకు వేసి ఇళ్లు పూర్తి చేయకుండా, స్థానిక నాయకులతో కలిసి తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాడు.