గుంటూరు నగరంలో వర్షం కారణంగా పొంగిపొర్లిన కాల్వలను గురువారం రాత్రి కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాల ప్రకారం పారిశుద్ధ్య విభాగం అధికారులు పరిశీలించారు. జీఎంసీ పరిసర ప్రాంతాలలో నిలిచిన నీటిని శానిటేషన్ విభాగం సిబ్బందితో దగ్గర ఉండి శుభ్రం చేయించారు. ప్రజలకూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, పారిశుద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు.