గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నగరపాలక సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు మంగళవారంతో 3వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా మంగళవారం కర్రసాము, గంగిరెద్దులు, ఎద్దుల ప్రదర్శనతో పాటూ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలు జరుగుతున్నాయి. కర్రసాము ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.