గుంటూరు జిల్లాలో వరద ముంపు వలన వ్యవసాయ, ఉద్యాన, చేనేత ఇతర రంగాలకు, మౌలిక సౌకర్యాలకు జరిగిన నష్టాలు, పునరావసం, రెస్క్యూకు రూ.107.76కోట్లు ఆర్థిక సాయం అవసరమని ఇంటర్ మినిస్ట్రీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసిటి)కు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి వివరించారు. ఇటీవల భారీ వర్షాలతో, కృష్ణా నది వరద నీటి ప్రవాహం వల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో సభ్యులు పరిశీలించారు.