వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు లక్షల్లో ఉంటారని, వారందర్నీ అరెస్ట్ చేసుకుంటూ పోతే జైళ్లు సరిపోవని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరిఫాతిమా అన్నారు. గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద సోమవారం నూరిఫాతిమా మాట్లాడారు. పాలన ఎలా ఉండకూడదో చూపించడం కోసం రెడ్ బుక్‌ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ కాకుండా టీడీపీకి కూడా సోషల్ మీడియా ఉందని గుర్తు చేశారు.