గుంటూరు నగరంలోని ఏటుకూరు హౌసింగ్ లే ఔట్స్ లో డిశంబరు చివరి నాటికి పెండింగ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం గుంటూరులోని ఏటుకూరు లే ఔట్స్ లో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన అన్నీ విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులు సమర్థవంతంగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.