కొత్త భవనం నిర్మాణం పేరిట గుంటూరులోని కొత్తపేట పోలీస్ స్టేషన్ ను ఆరేళ్ల క్రితం పడగొట్టారని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. తుళ్లూరు మండలం వెలగపూడి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇంత వరకు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణం చేయలేదన్నారు. వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు. గుంటూరు నగరంలో నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి వాడకాన్ని అరికట్టాలని హోం మంత్రి అనితను కోరారు.