వైయస్ఆర్సీపీ బీసీ నాయకులు కాటూరి విజయ్ ఆధ్వర్యంలో అరండల్ పేట లోని కార్యాలయంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాటూరి విజయ్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త మరియు మహిళల హక్కుల కోసం పోరాడి విద్యాదాతగా పేరు గడించిన మహోన్నత వ్యక్తిని స్మరించుకోవటం హర్షనీయమని తెలిపారు.