ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 40,105 మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ అరుణ్ బాబు వెల్లడించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం అయన మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగుస్తుందన్నారు. 2021 నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.