విశాఖపట్టణంలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనను నిరసిస్తూ, నిందితులని కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో ప్రదర్శన చేశాయి. ఐద్వా జిల్లా అధ్యక్షులు పద్మ మాట్లాడుతూ విశాఖలో లా విద్యార్థినిని ప్రేమపేరుతో నమ్మించి, సామూహిక అత్యాచారం చేయడం సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయమన్నారు