గురజాల, పిడుగురాళ్ల ఒక విద్యాసంస్థ సామాజికంగా, ఆర్థికంగా, నాణ్యతా పరంగా దినదినాభివృద్ధి చెందుతూ సుదీర్ఘంగా 40 యేళ్లు కొనసాగడంతో బాటు అదే పేరు ప్రఖ్యాతలు ఇప్పటికీ నిలబెట్టుకోవడం అంటే ఆ యాజమాన్యానికి ఎంత నిబద్ధత ఉందో అర్థం అవుతుందని పిడుగురాళ్ళ ఏబీసీ సీబీఎస్ఈ స్కూల్ 40వవార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి శ్రీమండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి విజ్ఞాన్ సంస్థల అధిపతి లావు రత్తయ్య పాల్గొని మాట్లాడుతూ 40 యేళ్లు నిర్విరామంగా కృషి పట్టుదలతో, ప్రస్తుత అనారోగ్యకర పోటీ మధ్య ఏబీసీ విద్యాసంస్థ ద్వారా వేలమంది విద్యార్థులను తీర్చి దిద్ది వారి ఉన్నతికి కారణమైన వింజమూరి అనంతయ్యంగార్ ను ఆయన కొనియాడారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానోత్సవం కార్య క్రమం ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి.