గుంటూరు నగరంలోని పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలతో శనివారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య, మైనర్లు డ్రైవింగ్ నడపడం తదితర అంశాలపై విద్యాసంస్థల ప్రతినిధులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్పీ మైనర్లు వాహనాలు నడిపితే తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థల వద్ద పోలీసు భద్రత పెంచుతామని సూచించారు.