జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్డు హిందూ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన సైన్స్ పోటీలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్ సంబరాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వెల్లడించారు. ప్రతిఏటా జరిగే సైన్స్ పోటీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.