గుంటూరు: నవంబర్ 6న కలెక్టరేట్ వద్ద ధర్నా

55చూసినవారు
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 6న కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ తెలిపారు. గుంటూరులోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో శనివారం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా కిరణ్ మాట్లాడుతూ విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్