గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి అధ్వర్యంలో నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో సోమవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 100 మంది నిరుద్యోగులు హాజరయ్యి తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని, ఇంటర్వ్యూలుకు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు శ్రీరాం ఫైనాన్స్, ఫెడరల్ క్యాపిటల్, వెస్ట్ సైడ్, హెచ్ ఆర్ అండ్ కో, హెచ్ వన్ హెచ్ ఆర్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 40 మంది ఎంపికైనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.