గుంటూరు నగరంపాలెం, అరండల్ పేట, పట్టాభిపురం, లాలాపేట పోలీస్ స్టేషన్లను బుధవారం అర్ధరాత్రి ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో సెంట్రీ కానిస్టేబుళ్ల పనితీరును, వారు బాధితులతో ప్రవర్తించే విధానాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. లాక్ అప్లను పరిశీలించి అనవసరంగా ఎవరిని కస్టడీలో ఉంచరాదని, కస్టడీలో ఉన్న వారికి కాపలా కోసం సిబ్బందిని నియమించాలని ఎస్పీ సూచించారు.