లంచం తీసుకుంటున్న వీఆర్ ఓ హసీనా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు రూరల్ మండలం వెంగలాయపాలెంకు చెందిన ప్రమీల తన పొలానికి పాస్ పుస్తకం ఇవ్వాలని వీఆర్ ఓ ను కోరారు. అందుకు రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని వీఆర్ ఓ డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నేడు ప్రమీల నుంచి రూ. 2 లక్షలు తీసుకుంటున్న వీఆర్ ఓ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు.