గుంటూరులో 1995లో శ్రీ షిర్డీసాయి దీన జన సేవాసమితిని స్థాపించి వేలాదిమంది అంధుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు కీర్తిశేషులు పబ్బరాజు వెంకటేశ్వరరావు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కొనియాడారు. ఈరోజు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గల బాలాజీ మండపంలో పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి పురస్కారం 2023 సభకు వల్లంరెడ్డి లక్షణ రెడ్డి అధ్యక్షత వహించారు.