11కేవీ విద్యుత్ లైన్ మెయింటెనెన్స్ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురవయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుజ్జనగుండ్ల, ఎస్వీఎన్ కాలనీ, నేతాజీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.