ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్ పేటలోని ఓ హోటల్ లో శుక్రవారం కృష్ణ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యేంత వరకూ ఎటువంటి డీఎస్సీ, మెగా డీఎస్సీ లాంటి ఏ ఇతర నోటిఫికేషన్లు కూడా ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.