ఎన్ఆర్ఐ కోటాలో ఈనెల 18న రెండో విడత కౌన్సెలింగ్

58చూసినవారు
ఎన్ఆర్ఐ కోటాలో ఈనెల 18న రెండో విడత కౌన్సెలింగ్
గుంటూరులోని ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్ఆర్ఐ కోటాలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి. రామచంద్రరావు గురువారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాం ఫాంలో హాజరు కావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్